శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (12:01 IST)

ఇట్స్ అఫీషియల్‌.. ప్రభాస్‌ సరసన దీపికా పదుకునే రొమాన్స్..

''సాహో'' సినిమా తర్వాత ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ 21వ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయాన్ని రివీల్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుందని అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంతో మంది బాలీవుడ్ భామలని తెలుగు పరిశ్రమకి పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ఈ సారి దీపికాని పరిచయం చేస్తోంది. 
 
ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ 'ప్రభాస్ 20' చిత్రానికి సంబంధించి టైటిల్‌ను ఇప్పటికే ప్రకటించారు.
 
'రాధేశ్యామ్' అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, ప్రశీదలు నిర్మిస్తున్నారు.