శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 9 జులై 2020 (21:55 IST)

టాప్ ప్రొడ్యూసర్‌కి షాక్ ఇచ్చిన ప్రభాస్..!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. దేశవిదేశాల్లో ఈ టాలీవుడ్ స్టార్ హీరోకి క్రేజ్ ఏర్పడడంతో అతనితో సినిమా చేయాలని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే... ప్రభాస్ మాత్రం బాహుబలి సినిమా తర్వాత సాహో చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్లోనే చేసాడు. ఆ తర్వాత సినిమా కూడా యు.వి. క్రియేషన్స్ సంస్థలోనే చేస్తున్నాడు.
 
ఈ సంస్థతో కలిసి గోపీకృష్ణా మూవీస్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే... ప్రభాస్‌తో సినిమా చేయాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రభాస్‌తో దిల్ రాజు మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేసారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సస్ సాధించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్‌తో మూవీ చేయాలని దిల్ రాజు ప్రయత్నించారు. భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
 
అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ప్రభాస్‌తో సినిమా చేయాలనుకుంటుంది. ఈ సంస్థ కూడా అడ్వాన్స్ ఇచ్చింది. అయితే.. దిల్ రాజు కానీ, మైత్రీ మూవీ మేకర్స్ కానీ ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఇప్పటివరకు సరైనా కథ కానీ, డైరెక్టర్‌ని కానీ సెట్ చేయలేకపోయారు.
 
ఇలాంటి టైమ్‌లో అనుకోకుండా బాలీవుడ్ నుంచి ఓ భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ చెప్పిన స్టోరీ ప్రభాస్‌కి చాలా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత తన బ్యానర్లో సినిమా చేస్తాడనుకుంటే... బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పడంతో దిల్ రాజు షాక్ అయ్యాడని సమాచారం. అంతేకాకుండా.. తను ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేయమన్నట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గ స్టోరీ, డైరెక్టర్‌ని సెట్ చేసే పనిలో ఉన్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అదీ.. సంగతి..!