శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 జులై 2020 (13:51 IST)

మిస్డ్ కాల్‌తో యువకుడిని పట్టేసింది, భర్తకు తెలిసి కరోనా క్వారెంటైన్లో పడిపోయింది...

ఈమధ్య కాలంలో సెల్ ఫోన్ల ప్రేమాయణం ఎక్కువయిపోతున్నాయి. జస్ట్ ఫోన్ కాల్ తోనే దగ్గరపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆ తర్వాత అవి కాస్తా పెటాకులవుతున్నాయి. అలాంటి ఘటనే తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవిలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవి కూలీ కార్మికుడు తన సమీప బంధువుల కుమార్తె అయిన మహిళతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తె వున్నారు. ఐతే ఏడాదిన్నర క్రితం ఆమె ఫోనుకి కాయత్తార్‌కి చెందిన ఓ యువకుడి నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తొలుత దాన్ని పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఆ మిస్డ్ కాల్ నుంచి వచ్చిన నెంబరుకి ఫోన్ చేసింది.
 
అవతల ఓ యువకుడు మాట్లాడటంతో కొద్దిసేపు ముచ్చటించింది. అలా సాగిన ముచ్చట్లు కాస్తా ప్రేమగా మారిపోయింది. ఐతే తనకు పెళ్లయినట్లు వివాహిత మహిళ చెప్పలేదు. ఈ క్రమంలో తనను పెళ్లాడాలని యువకుడికి చెప్పడంతో అతడు కూడా సరేనన్నాడు. అలా 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని గత 20వ తేదీ ప్రియుడితో తెన్‌కాశి సమీపంలో సుందరపాండియన్‌ పురానికి వెళ్లి ప్రియుడి బంధువుల ముందు వివాహం చేసుకుంది.
 
ఊరుకి వెళ్లివస్తానని చెప్పిన తన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. మరోవైపు ప్రియుడిని పెళ్లాడిన మహిళ తన ఫోనులోని వాట్సాప్ స్టేటస్ లో ప్రియుడితో వున్న ఫోటోను పెట్టేసింది. ఇది కాస్తా భర్త చూసి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో జులై 1వ తేదీన సదరు మహిళను, ప్రియుడిని పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది.
 
అప్పటికే పెళ్లయిన మహిళ తనకు వద్దని ఆ యువకుడు చెప్పేశాడు. మరోవైపు ఎవడినో పెళ్లి చేసుకున్న తన భార్య తనకు అవసరం లేదని భర్త చెప్పేశాడు. దీనితో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి సదరు మహిళను సేరన్‌ మహాదేవిలోని కరోనావైరస్ శిబిరానికి పంపారు. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. చివరికి ఆమెను ఎవరు అంగీకరిస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.