నిప్పులేనిదే పొగరాదు కదా.. మా యిద్దరి రొమాన్స్ అలాంటిదే : దీపికా పదుకొణె
దీపికా పదుకొణె. బాలీవుడ్ భామ. ఆ తర్వాత హాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది "ట్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆప్ జాండర్ కేజ్" అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో హీరో విన్ డీజిల్. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్
దీపికా పదుకొణె. బాలీవుడ్ భామ. ఆ తర్వాత హాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది "ట్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆప్ జాండర్ కేజ్" అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో హీరో విన్ డీజిల్. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య రొమాన్స్ జరిగిందంటూ ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో గత శనివారం వీరు నటించిన హాలీవుడ్ చిత్రం భారత్‌లో విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపికా తమ సంబంధంపై పెదవి విప్పింది.
'హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ అద్భుతమైన పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. ఇదంతా నా ఊహల్లోనే. ఆయనపై చాలా ప్రేమ ఉంది. మా మధ్య కెమిస్ట్రీ అమేజింగ్. మేం కలిసే ఉంటున్నాం కూడా. మాకు ఈ పిల్లలున్నారు. కానీ.. ఇదంతా నా కలలోనే. మా మధ్య రొమాన్స్ అంటరా.. నిప్పులేనిదే పొగ రాదు కదా..!' అంటూ ఓ టీవీ షో వెల్లడించింది.