''నా చిట్టితండ్రి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో'' .. హీరో ధనుష్
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళ స్టార్ ధనుష్‌తో 2004 నవంబర్ 18న జరిగింది. ఈ దంపతులకు యాత్రా అనే కుమారుడున్నాడు. అక్టోబర్ 10న పుట్టినరోజు. ఈ సందర్భంగా ధనుష్ తన కుమారుడి
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళ స్టార్ ధనుష్‌తో 2004 నవంబర్ 18న జరిగింది. ఈ దంపతులకు యాత్రా అనే కుమారుడున్నాడు. అక్టోబర్ 10న పుట్టినరోజు. ఈ సందర్భంగా ధనుష్ తన కుమారుడితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించిన ఫొటోను ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
''నా చిట్టితండ్రి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో'' అంటూ ధనుష్ తన కుమారుడి గురించి ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడి గురించి ఈ విధంగా పోస్ట్ చేశాడు. తన కుమారుడి మనసు బొమ్మల నుంచి గాడ్జెట్లపై మళ్లిందని, తన కొడుకు అప్పుడే పెద్దవాడైపోయాడో... హ్యాపీ బర్త్‌డే యాత్రా..'' అంటూ ధనుష్ కుమారుడితో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.