సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (18:38 IST)

పెద్దలు కుదిర్చిన పెళ్ళికి ఒప్పుకుంది.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది?

దిగాంగన.. ఈ పేరు కొంతమంది తెలియకపోయినా రెగ్యులర్‌గా సినిమాలు చూసే వారికి మాత్రం తెలిసి ఉంటుంది. 'హిప్పీ' అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా యువ ప్రేక్షకుల్లో మాత్రం దిగాంగనకు మంచి పేరే వచ్చింది. 
 
ఆమె తాజాగా నటించిన చిత్రం "వలయం". ఈనెల 21వతేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే వలయం సినిమాతో తానేంటో నిరూపించుకుంటానంటోంది దిగాంగన. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు దిశ. ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్ళికి ఒప్పుకుంటాను. మరో వారంరోజుల్లో పెళ్ళి ఉండగానే నేను కనిపించకుండా పోతాను.
 
సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకుండి. అలాగే సిటీమార్ సినిమాలో గోపీచంద్ కు జోడీగా నటిస్తున్నాను. ఇలా సినిమాను పెంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ తెలుగు సినీపరిశ్రమలో నా జర్నీ కొనసాగిస్తానంటోంది దిగాంగన.