సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (11:46 IST)

వరుణ్‌కు తండ్రిగానా.. నో.. నెవర్.. అపుడే తండ్రిపాత్రలా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ తేజ్ తల్లిగా రమ్యకృష్ణ, తండ్రిగా తమిళ హీరో మాధవన్ నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. 
 
ఓ నెటిజ‌న్.. ఏంటీ, నిజంగా మాధ‌వ‌న్ తండ్రి పాత్ర పోషిస్తున్నారా? ఇది ఫేక్ అని నేను న‌మ్ముతాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి మాధ‌వ‌న్ స్పందిస్తూ.. టోట‌ల్లీ ఫేక్ బ్రో.. నేను ఇంకా చిన్న పిల్లాడినే అని చెప్పి పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టారు. 
 
ఇక వ‌రుణ్ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి. వ‌రుణ్ పదో చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.