శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (11:39 IST)

వింత వ్యాధితో బాధపడుతున్న సుప్రీమ్ హీరో

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు సాయిధరమ్ తేజ్ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ హీరో ఓ అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. తాను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదని, ఈ తరహా పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని వాపోయాడు. 
 
కాగా, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో "ప్ర‌తిరోజూ పండగే" అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 
 
అయితే ఈ చిత్రంలో తేజూకి అనారోగ్య స‌మ‌స్య ఉంటుంద‌ని, దాని ఆధారంగా మారుతి కామెడీ జ‌న‌రేట్ చేసాడ‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మారుతి హిట్ చిత్రాల‌లో దాదాపు ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉంటున్న సంగ‌తి తెలిసిందే. 'భలేభ‌లే మ‌గాడివోయ్' చిత్రంలో నాని మ‌తిమ‌రుపుతో ఇబ్బంది ప‌డగా, 'బాబు బంగారం' సినిమాలో వెంకీ అతి మంచిత‌నంతో బాధ‌ప‌డ‌తారు. 
 
'మ‌హానుభావుడు' చిత్రంలో శ‌ర్వానంద్ ఓసీడీ (అతి శుభ్రత)తో ఇబ్బంది పడుతుంటాడు. ఇలా మారుతి సినిమాల‌లో రోగంని హైలైట్ చేస్తూ కామెడీని జ‌న‌రేట్ చేశారు. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న 'ప్ర‌తిరోజూ పండ‌గే' సినిమాలోను తేజూకి కూడా ఏదో ఒక రోగం ఉంటుంద‌ని నెటిజ‌న్స్ చెబుతుండ‌గా, దానిని హీరో సాయిధరమ్ ఖండించాడు. 
 
త‌న‌కి ఎలాంటి రోగంలేద‌ని, ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌, రావూ రమేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూర్చారు.