సాయితేజ్‌తో రాశీఖన్నా.. మరోసారి జత కట్టనుందా?
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భలే భలే మగాడివోయ్` సినిమాని అందించిన గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్రలహరి` సక్సెస్ తర్వాత సాయితేజ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది.
సాయితేజ్, రాశీఖన్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్, రాశీఖన్నాల కెరీర్‌లోనే సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ చిత్రంలో సత్యరాజ్ వంటి భారీ తారాగణం కూడా నటించనున్నారు. కాగా... ఈ సినిమా వచ్చేవారం లాంఛనంగా ప్రారంభం కానుందట.