శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (19:20 IST)

రోజుమార్చి రోజు పాల్గొంటున్నాడు... నాకది ఇష్టంలేదని చెప్పాలనుకుంటున్నా...

నాకు ఇద్దరు పిల్లలు. ఇపుడు నా వయసు 38 ఏళ్లు. నా భర్త విదేశాల్లో నుంచి శాశ్వతంగా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి రోజుమార్చి రోజు శృంగారం కావాలంటున్నారు. ఆయన విదేశాల్లో ఉండగా యేడాదికి రెండుసార్లు వచ్చేవారు. ఆ సమయంలోనే పాల్గొనేవాళ్ళం. కానీ, ఇపుడు రోజుమార్చి రోజు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అసలు దానిపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆయన సంతృప్తి కోసం భావప్రాప్తి పొందినట్టుగా నటిస్తున్నా. నిజంగా నాకు దానిపై ఆసక్తి లేదనే విషయాన్ని ఆయనకు ఎలా చెప్పాలి? 
 
ఏ సమస్య పరిష్కారానికైనా ప్రధానంగా చర్చలు, సమాచార మార్పిడే ముఖ్యం. ఇది భార్యాభర్తల దాంపత్య జీవితానికి సంబంధించిన అంశం. పడక గది విషయాలు, సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. అందువల్ల భార్యకు లేదా భర్తకు వచ్చే సమస్యలు వారిద్దరే చర్చించుకుని పరిష్కరించుకునేవిగా ఉండాలి. ఇతరుల జోక్యం సరికాదు. 
 
దాంపత్య జీవితంలో శృంగారం అత్యంత ముఖ్యమైనది. అదేసమయంలో స్త్రీపురుషులిద్దరూ యాక్టివ్ రోల్ పోషిస్తేనే ఈ జీవితం ఆనందమయంగా ఉంటుంది. అయితే, భార్య యాక్టివ్‌గా ఉంటూ శృంగారానికి సమ్మతించక పోతే.. ఖచ్చితంగా భర్త పెడదారి పట్టే అవకాశాలుంటాయి. అందువల్ల దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి భర్త దృష్టికి తీసుకెళ్లడం మంచిది.