ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (21:46 IST)

స్త్రీ క్లోజ్‌గా వుంటే చాలు... ఆమెతో నాకు అది వుందని చెప్పేస్తారట...

బోయ్ ఫ్రెండ్ లేదా క్లోజ్ ఫ్రెండ్ సదరు మహిళపై జోకులు లేదా గాసిప్స్ పుట్టిస్తారంటే నమ్మలేం కదూ. కానీ ఇది నిజంగా నిజం. అసు ఈ గాసిప్స్ వారిపై ఎందుకు పుట్టిస్తారు... ప్రేమతోనా లేదంటే ద్వేషంతోనా? ఇలాంటి వాటిని తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
 
ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో 18 నుంచి 58 ఏళ్ల వయసున్న 467 మంది(269 మహిళలు, 198 మంది పురుషులు) రోజువారీ తీరుపై ఎలక్ట్రానికల్లీ యాక్టివేటెడ్ రికార్డర్స్(EARS) ద్వారా పరిశీలించారు. ఇందులో తమ పక్కన లేనివారి మీద 4003 గాసిప్స్ సృష్టించినట్లు తేలింది. 
 
అలాగే పరిశోధకులు గాసిప్స్ పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ అనే మూడు విభాగాలుగా పరిశీలించారు. ఇందులో పురుషులే మహిళలపై అధికంగా గాసిప్స్ పుట్టిస్తారని తేలింది. ఇందులోనూ ఓ మహిళ తనకు బాగా స్నేహంగా, క్లోజ్‌గా వుంటే చాలు... ఆమెతో తనకు శృంగార అనుబంధం వుందని చెప్పేస్తున్నట్లు తేలింది. 
 
ఒక వ్యక్తి సగటును 52 నిమిషాలు గాసిప్స్ పుట్టిస్తూ మాట్లేడేస్తుంటారని కనుగొన్నారు. కాగా గాసిప్స్‌లో నాల్గవ వంతు న్యూట్రల్‌గా వున్నాయట. అంటే వీటివల్ల ఎలాంటి హాని వుండదు. ఐతే పాజిటివ్ గాసిప్స్ కంటే నెగటివ్ గాసిప్స్ రెండింతలుగా మాట్లాడుతుంటారని తేలింది. ఇవి కూడా తమకు చాలా సన్నిహితంగా వున్నవారిపైనే పుట్టించడం గమనార్హం.