గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (21:06 IST)

కొలీగ్స్‌తో డ్యాన్స్ చేస్తుంది.. నాతో శృంగారానికి నిరాకరిస్తోంది.. ఎందుకని!

నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత ఆమె ప్రవర్తన చూసి షాకవుతున్నాను. తన కంపెనీలో పనిచేసే మేల్ అండ్ ఫిమేల్ కొలీగ్స్‌ను ఇంటికి పిలిచి ఓ రోజు నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత వాళ్లందరూ మా ఇంటికి వారంలో ఏదో ఒకరోజు కట్టగట్టుకుని వచ్చేస్తారు. ఆ రోజు వాళ్లందరికీ తినేందుకు రెడీ చేస్తుంది. వారితో హ్యాపీగా డ్యాన్స్ కూడా చేస్తుంది. 
 
నన్ను కూడా డ్యాన్స్ చేద్దువుగాని రమ్మంటుంది కానీ నేను వెళ్లను. ఐతే నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే... నాతో శృంగారానికి ఆమె ససేమిరా అంటోంది. మరికొన్నాళ్లు అలాగే యంగ్ గా వుండి ఇలా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయాలంటోంది. ఆమెను ఎలా మార్చాలో అర్థంకావడంలేదు.
 
పెళ్లయిన కొత్తలో కొంతమంది యువతులు ఇలా ప్రవర్తిస్తుంటారు. శృంగారంలో పాల్గొంటే తమ అందం తరిగిపోతుందనీ, పిల్లలు పుడితే ఇక భవిష్యత్తులో తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడపలేమని అనుకుంటారు. ఇది కూడా వారికి ఎవరో చెబితే అలా మారుతుంటారు. వాస్తవానికి గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తూ కొన్నాళ్లపాటు ఆమె అనుకున్నట్లే వుండవచ్చు. కానీ శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడతారు కాబట్టి ఇక శృంగారమే వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ఆమెతో ఇవన్నీ విడమర్చి చెబితే మీ దారికి వస్తుంది. చెప్పి చూడండి. అప్పటికీ వినకపోతే సైకాలజిస్టు వద్దకు తీసుకుని వెళ్లాల్సిందే.