సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (11:04 IST)

కాల్ టారిఫ్ ఛార్జీలను పెంచనున్న భారతీ ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ సంస్థ టెలికాం రంగంలోని పోటీ వల్ల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కాల్ టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకుంది. గడిచిన దశాబ్ద కాలంగా టారిఫ్‌లను తగ్గిస్తూ వచ్చింది. కానీ టెలికాం రంగంలోని పోటీవల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఈ మేరకు కాల్ టారిఫ్ ఛార్జీలు పెంచేందుకు కారణం నష్టాలేనని ఎయిర్‌టెల్ తెలిపింది. 
 
కాగా ఎయిర్‌టెల్ ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.23,045 కోట్ల నికర నష్టాలు చవిచూసింది. అంతేకాదు ట్రాయ్‌కు పలు బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాల్ టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. 
 
గత ఏడాది ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.118.80 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. కానీ ఈ ఏడాది జియో దెబ్బతో ఎయిర్ టెల్ మాత్రమే కాకుండా ఇతర టెలికాం రంగ సంస్థలన్నీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే.