సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (14:55 IST)

ఐడియాకు ఆ ఐడియా లేదు.. వొడాఫోన్‌కు హ్యాండివ్వడం ఖాయం?

వొడాఫోన్, ఐడియా సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తరుణంలో.. కొత్త పెట్టుబడులను చెల్లింపులు చేయక.. ఐడియా సంస్థ జారుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వొడాఫోన్, ఐడియా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం 99వేల కోట్లు. దీనిపై కోర్టు కూడా రుణాన్ని కేంద్రానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అధిక రుణంతో నానా తంటాలు పడుతున్న ఐడియా సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తోంది. 
 
కానీ ఐడియా, వొడాఫోన్ సంస్థలు నష్టాలనే చవిచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు సంస్థలు రుణ భారాన్ని తగ్గించేందుకు సహకరించాలని లేఖలు రాశాయి. ఈ సమస్యకు ఇంకా పరిష్కారం రాని నేపథ్యంలో కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అసలే అప్పులు.. ఇక పెట్టుబడులు వేరేనా..? అంటూ ఇరు సంస్థలు తలపట్టుకున్నాయి.  ఐడియా అయితే బయట నుంచి పెట్టుబడుల కోసం వేచి చూస్తోంది. 
 
ఈ వ్యవహారంపై వొడాఫోన్ ఉప వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం, కొత్త పెట్టుబడులు లేని పక్షంలో భారత్‌లో వొడాఫోన్ సేవలను కొనసాగించడం కఠినమని పేర్కొన్నారు. ఐడియా కూడా చేతులు దులుపుకునే పరిస్థితుల్లో వున్నందున కొత్త మార్గం కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఐడియాకు వొడాఫోన్‌లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదనే విషయాన్ని వొడాఫోన్ సంస్థకు చెందిన ఆ అధికారి వెల్లడించారు.