శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (20:00 IST)

జియో ఫోన్ కస్టమర్లకు మరో ఆఫర్ - రూ.75తో మంత్లీ ప్లాన్

తమ కస్టమర్లకు రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఆల్ వన్ ప్లాన్‍‌ను అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో... తాజాగా ఇండియా కా స్మార్ట్ ఫోన్ కస్టమర్ల కోసం మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఓ మంత్లీ ప్లాన్ కావడం గమనార్హం. 
 
ఈ ప్లాన్లలో భాగంగా, రూ.75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది.
 
అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది. అలాగే అపరిమిత జియో - టు - జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి. 
 
ఇటీవల ఇంటర్‌ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి)  చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై  వినియోగదారులనుంచి  నిరసన వ్యక్తం కావడంతో  స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల‍కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.