బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:42 IST)

పవన్ కళ్యాణ్ - కొరటాల శివ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ మూవీ...

కొరటాల శివ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు. హీరో ప్రభాస్‌తో "మిర్చి", మహేష్ బాబుతో "శ్రీమంతుడు", జూనియర్ ఎన్టీఆర్‌తో "జనతా గ్యారేజ్" వంటి బ్లాక్‌బస్టర్

కొరటాల శివ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు. హీరో ప్రభాస్‌తో "మిర్చి", మహేష్ బాబుతో "శ్రీమంతుడు", జూనియర్ ఎన్టీఆర్‌తో "జనతా గ్యారేజ్" వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన చిత్ర దర్శకుడు. ఈ దర్శకుడితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జతకట్టనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పవర్ ఫుల్ మూవీ రానుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయట. 
 
ప్రస్తుతం 'కాటమరాయుడు' షూటింగ్ ఫినిష్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నమైవున్నాడు. ఈ మూవీ కోసం కంటిన్యూగా డేట్స్ ఇచ్చేశాడు. టాకీ మొత్తం పూర్తయి.. సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ మాత్రమే ఉంది. 'కాటమరాయుడు' తర్వాత త్రివిక్రమ్ మూవీ లైన్‌లో ఉంది. ఈ చిత్రం తర్వాత హ్యాట్రిక్ హిట్స్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో పవన్ మూవీ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ న్యూస్.
 
ఇప్పటికే కొరటాల చెప్పిన లైన్ నచ్చి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఫిల్మ్ నగర్‌ వర్గాల సమాచారం. దాంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో కొరటాల నిమగ్నమైవున్నారు. పవన్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు కొరటాల శివ - మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత పవన్‌తో జతకట్టనున్నాడు.