1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Director Puri Jagannath appears before ED

10 గంటల పాటు పూరీని ప్రశ్నించిన ఈడీ.. బ్యాంక్ లావాదేవీలపై..?

Director
టాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 
 
ఈ క్రమంలో పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. 
 
ఈ క్రమంలో ఈడీ పూరి స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.
తర్వాతి కథనం
స‌మంత న‌టించిన `ఓ బేబీ` నిర్మాత మ‌రో సినిమాకు రెడీ