థియేటర్లు మూత అనే వదంతలు నమ్మవద్దుః తలసాని (video)
ప్రస్తుతం మరలా కోవిడ్ విజృంభన దృష్ట్యా దేశంలో రకరకాలు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలకు, హీరోలకు భయపట్టుకుంది. మరలా లాక్‌డౌన్ వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నాయి.
ఇటీవలే రానా దగ్గుబాటి కూడా ఇదే విషయంపై స్పందిస్తూ, నార్త్‌లోనూ తెలుగు రాష్‌ట్రాలలో కోవిడ్ పెరుగుతుంది. అయినా అరణ్య విడుదలకు ఎటువంటి ఆటంకాలు కలగవు అన్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆరణ్య హిందీ వర్షన్ ప్రస్తుత పరిస్థితులలో విడుదలచేసేది లేదని చిత్ర నిర్మాతలు స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో తెలుగు పరిశ్రమలో మరలా థియేటర్లు మూతపడనున్నాయని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం తెలంగాణా మంత్రి తలసాని యాదవ్ దృష్టికి తీసుకెళ్ళారు పెద్దలు. అందుకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
సినిమా ధియేటర్లను మూసి వేస్తారని వస్తున్న వదంతులను నమ్మకండి. కోవిడ్ నిబంధనలతోనే సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తాయి. ఇటీవల కాలంలో కరోనావల్ల సినిమారంగానికి ఎక్కువ నష్టం జరిగింది. 24 క్రాఫ్ట్‌లో లక్షలాది మందికి సినిమా జీవనాథారం. ఏ మాత్రం థియేటర్లు మూసేసినా వేలాదిమంది రోడ్డున పడతారు. కనుక ప్రభుత్వం అన్నీ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కోవిడ్ నిబంధనల మేరకు ఎలా థియేటర్లు రన్ అవుతున్నాయో అలాగే కొనసాగుతాయి. ఎటువంటి ఆలోచన పడవద్దుఅని తేల్చి చెప్పారు.