శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (19:27 IST)

డంకీ’ సినిమాను చూడటానికి భారీ సంఖ్యలో స్వదేశానికి వస్తోన్నషారూక్ ఖాన్ ఫ్యాన్స్

Shahrukh Khan,Taapsee Pannu, Vicky Kaushal
Shahrukh Khan,Taapsee Pannu, Vicky Kaushal
షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వస్తుండటం విశేషం. డంకీ సినిమాలో ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగాలు విదేశాల్లోని వారికి తమ మాతృదేశానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చాయి. దీంతో వారు తమ కుటుంబాలు, సన్నిహితులతో కలిసి ఈ క్రిస్మస్ పండుగ సీజన్‌లో డంకీ సినిమాను చూసి ఆ యూనిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని పొందటానికి తహతహ లాడుతున్నారు. ఇలా ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన అభిమానులు తమ అభిమాన కథానాయకుడు నటించిన డంకీ సినిమా గ్లోబల్ సెలబ్రేషన్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు.
 
షారూక్ ఖాన్ సినిమాలను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేయటానికి ఆయన అభిమాన సంఘాలు వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటాయి. డంకీ విషయంలోనూ అలాంటి మార్గాన్నే వారు ఎంచుకున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, షారూక్ పాత్ర తన ప్రియమైన వారి కోసం సరిహద్దులను దాటుతుంది. కొందరు సరిహద్దులను దాటటానికి అక్రమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. కానీ ఇక్కడ అభిమానులు సరిహద్దులను దాటటానికి చట్ట బద్దమైన మార్గాలను ఎంచుకుంటారు. ప్రియమైన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనేది సినిమా మెయిన్ థీమ్. అదే సెంటిమెంట్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.
 
‘‘అభిమానులకు అందుబాటు థియేటర్స్‌లోనే డంకీ సినిమాను ఉంటుంది. మూవీలోని విజువల్స్ వారికి వారి కుటుంబాలను, స్నేహితులను గుర్తుకు తెస్తుంది. అందువల్ల వారు అందరితోకలిసి డంకీ సినిమాను ఆస్వాదించాలనుకుంటారు. నేపాల్, కెనడా, అమెరియా, ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి 500కి పైగా అభిమానులు డంకీ సినిమా కోసం ఇండియాకు వస్తున్నారు’’ అని సన్నిహిత వర్గాల సమాచారం.  
డంకీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. డంకీ డ్రాప్ 1 వీడియోతో పాటు డంకీ డ్రాప్ 2 విడుదలైన లుట్ పుట్ గయా.. సాంగ్ అంచనాలను పెంచాయి. ప్రేమ, స్నేహం వంటి ఎమోషనల్ అంశాలతో సినిమా తెరకెక్కింది.
 
డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.