దాసరి సమక్షంలో `ఎక్కడికి పోతావు చిన్నవాడా` 50 రోజుల సెలబ్రేషన్స్
వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియా థ్రిల్లర్ మూవీ `ఎక్కడికి పోతావు చిన్నవాడా`. హెబ్బాపటేల్, నందిత శ్వేత, అవికాగోర్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని మేఘన ఆర్ట్
వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియా థ్రిల్లర్ మూవీ `ఎక్కడికి పోతావు చిన్నవాడా`. హెబ్బాపటేల్, నందిత శ్వేత, అవికాగోర్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని మేఘన ఆర్ట్స్ బ్యానర్‌పై పి.వెంకటేశ్వరరావు నిర్మించారు. నవంబర్ 18న విడుదలై సూపర్బ్ కలెక్షన్లతో జనవరి 6 నాటికి దాదాపు 28 ధియోటర్స్ లో 50 రోజుల వేడుక పూర్తిచేసుకుంది. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` విడుదలైన ఆట నుండి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అమెరికా నుండి అనకాపల్లి వరకు భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. ప్రేక్షకుల వద్ద చిల్లర సమస్యలు వచ్చినా కంటెంట్ వున్న చిత్రాన్ని అనూహ్యంగా ఆదరించారు. ఇలాంటి చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తే ముందుగా తెలుగు సిని పరిశ్రమలో ఆనందపడి ప్రోత్రాహన్నిచ్చే దర్శకగురు, దర్శకరత్న దాసరి నారాయణ గారు సమక్షంలో చిత్ర యూనిట్ అంతా వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు ఆడినప్పుడు ఆనందించే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడిని.. మంచి కాన్సెప్ట్‌తో బడ్జెట్ ఫిల్మ్‌గా చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇంత పెద్ద ఘనవిజయం సాధించటం పరిశ్రమకి మంచిది. ఈరోజుల్లో 28 థియేటర్స్‌లో 50 రోజులు పూర్తిచేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడూ కొత్త చిత్రాలు చేస్తున్న నిఖిల్‌కి, ఇలాంటి చిత్రం దర్శకత్వం చేసిన ఆనంద్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీడియా ముందు చెప్పటం కాదు నాకు బాగా నచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రంలో చేసిన పృద్వి, రాజారవీంద్ర, సత్య, సుదర్శన్ అలాగే హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. వీరందరికి మంచి లైఫ్ వుంటుంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి, విజయాలు సాధించాలి.. అని అన్నారు
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మాకు తెలిసి లివింగ్ లెజెండ్ దాసరినారాయణ గారు, ఆయన చిత్రాలు చూసి పెరిగాము. ఇప్పుడు కూడా టెలివిజన్‌లో వచ్చే చిత్రాలు చూస్తుంటాము. ఇప్పుడు జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ అప్పుడే దాసరి గారు తన చిత్రాల్లో చూపించారు. అలాంటి లివింగ్ లెజెండ్ చేతుల మీదుగా మా 50 రోజుల ఫంక్షన్ జరుపుకోవటం చాలా ఆనందగా వుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నమ్మి నిర్మాణం చేపట్టిన మా నిర్మాత వెంటేశ్వరావు గారికి నా ప్రతేఖ దన్యవాదాలు. అలాగే ఈరోజు మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి, పాత్రికేయులకి మా ధన్యవాదాలని అన్నారు
దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో మొట్టమొదటి షీల్డ్ ఇది. అదికూడా మా దర్శకుల గురువు దాసరి నారాయణ గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకోవటం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నమ్మి నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన నిర్మాత వెంటేశ్వరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు.