గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:12 IST)

బాహుబలి2.. సినీ యూనిట్‌కు చేదు అనుభవం.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో జాతివివక్ష వ్యాఖ్యలు!

ప్రముఖ దర్శకుడు జక్కన్న బాహుబలి 2 సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రజలంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షక

ప్రముఖ దర్శకుడు జక్కన్న బాహుబలి 2 సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రజలంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుండి అదనపు షోలకు అనుమతి తీసుకున్నారు.. నిర్మాతలు. అయితే బాహుబ‌లి-2 సినిమా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రోజుకి ఆరు షోలకు అనుమతి ఇవ్వ‌డం వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని సినీ ప్రేక్షకుల సంఘం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.
 
ఏపీ సినీ ప్రేక్షకుల సంఘం బాహుబలి 2 చిత్రానికి అదనపు షోలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కలిశారు. ఈ విధంగా అదనపు షోలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధమని, వెంటనే ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇలాంటి వివాదాలు బాహుబలి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. బాహుబలి చిత్ర యూనిట్‌కు చేదు అనుభవం ఎదురైంది. 
 
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సిబ్బంది బాహుబలి టీమ్ సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు తన ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ప్రమోషన్ కోసం యూనిట్ సభ్యులు దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తర్వాత వీళ్లంతా దుబాయ్‌ నుంచి (ఎమిరేట్స్‌ ఈకే 526) హైదరాబాద్‌కు బయలుదేరేందుకు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు.
 
గేట్‌ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్ర బృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించిందని, నేను తరచూ ఎమిరేట్స్‌కి ప్రయాణిస్తుంటాను కానీ, ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని శోభు రాసుకొచ్చారు.