మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (23:03 IST)

27 ఏళ్ల వయసులోనే యూట్యూబర్ శ్రియ మురళీధర్ మృతి

Sreya
యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌, యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో మరణించింది. ఆమె 27 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం అందరినీ కలిచివేస్తోంది.
 
శ్రియా పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. బ్యూటీ అండ్ ద బాస్ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది. అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది.
 
యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన కూడా ఉంది. కాగా శ్రియా మురళీధర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.