ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (12:43 IST)

పండగ పూట విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి

పండగపూట విషాదం జరిగింది. గుండెపోటుతో ఓ యువ క్రికెటర్ మృతిచెందాడు. సౌరాష్ట్ర యువ ఆట‌గాడు అవి బ‌రోట్ శుక్ర‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించాడు. బ్యాట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బ‌రోట్ అండ‌ర్ - 19 క్రికెట్ జ‌ట్టుకు (2011) కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. 
 
29 ఏళ్ల వ‌య‌సున్న బ‌రోట్ అకాల మ‌ర‌ణం చెంద‌డంపై క్రీడా ప్ర‌పంచం ఒక్క‌సారిగా షాక్‌కి గురైంది. బ‌రోట్ మ‌ర‌ణంపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. బ‌రోట్ మ‌ర‌ణ వార్త‌ను సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) అధికారికంగా ప్ర‌క‌టించింది. 
 
ఈ విష‌య‌మై ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వార్త విని ప్రతి ఒ​క్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్‌ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’ అని మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.