'తీన్మార్' స్టెప్పులకు డ్యాన్స్ చేసి కేక పుట్టించిన 'జాతిరత్నాలు' బ్యూటీ
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టిన ఈ భామ చిత్రంలో చిట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది.
ఈ చిత్రం తర్వాత ఫరియాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు నిర్మాతలు కూడా క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్ధుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
పైగా, అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది.
ఈ ముద్దుగుమ్మ తాజాగా తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేసి కేక పెట్టించింది. 'నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. డ్రమ్ పవర్ ఇదే' అంటూ తన వీడియోకి కామెంట్ పెట్టింది. సెలబ్రిటీ అని మరచి రోడ్డు మీద ఫరియా ఇలా డ్యాన్స్ చేయడంపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫరియా డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి