1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 11 మే 2016 (17:33 IST)

24 సినిమాకు వచ్చే చిన్నారులకు వాచ్ ఫ్రీ.. మే 11 నుంచి 24 వరకే!?

టైం వాచ్ ట్రావెలర్‌ రూపుదిద్దుకున్న సూర్య ''24'' సినిమాను చూసేందుకు సినిమా థియేటర్లకు వచ్చే చిన్నారులకు వాచ్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు యూనిట్ ప్రకటించింది. మే 11 నుంచి 24వ తేదీ వరకు 24 సినిమాను థియేటర్లలో చూసే 8 వయస్సు లోపు గల చిన్నారులకు ఉచితంగా వాచ్‌లను ఇవ్వనున్నట్లు తెలిపింది.  
 
సూర్య హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని రిలీజైన 24కు సక్సెస్ టాక్ వచ్చింది. ఈ సినిమా మొత్తం వాచ్‌ చుట్టే తిరుగుతుంది. సినిమాను వాచే నడిపిస్తుంది. అందుకే ఈ సినిమా చూసేందుకు వచ్చే చిన్నారులకు (మే 11 నుంచి 24 వరకు) వాచ్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సినీ యూనిట్ పేర్కొంది.