శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (01:21 IST)

బాహుబలి నుంచి ఘాజీ దాకా.. రానా ప్రయాణం

బాహుబలి సినిమా రెండు భాగాల కోసం ఏడేళ్ల సమయం వెచ్చించానని, ఇంత సమయం ఒక సినిమాకోసం వెచ్చించడం ఏ నటుడికైనా అసాద్యమే కానీ ఇలాంటి సినిమాను ఇప్పటికైతే ఎవరూ చేయలేరు కాబట్టి నాలుగైదు సినిమాల కంటే పేరు తెచ్చే ఒక్క సినిమా చాలు అనే భావనతోనే రాజమౌళి అడగ్గానే బాహ

బాహుబలి సినిమా రెండు భాగాల కోసం ఏడేళ్ల సమయం వెచ్చించానని, ఇంత సమయం ఒక సినిమాకోసం వెచ్చించడం ఏ నటుడికైనా అసాద్యమే కానీ ఇలాంటి సినిమాను ఇప్పటికైతే ఎవరూ చేయలేరు కాబట్టి నాలుగైదు సినిమాల కంటే పేరు తెచ్చే ఒక్క సినిమా చాలు అనే భావనతోనే రాజమౌళి అడగ్గానే బాహుబలిలో నటించడానికి ఒప్పేసుకున్నానని టాలివుడ్ హీరో రానా చెబుతున్నారు. బాహుబలి మనిషిని ఊహాలోకాల్లోకి తీసుకుని పోయే మనోహరమైన ఫాంటసీ చిత్రం కాగా, ఘాజీ ది అటాక్ సినిమా 1971 నాటి బారత్-పాక్ యుద్ధ సమయంలోని ఒక నిర్ణాయకమైన ఘటనకు సంబంధించిన వాస్తవంపై అల్లిన కల్పిత గాథ అన్ని రానా చెప్పారు.
 
బాహుబలి నుంచి ఘాజీ ది అటాక్ వరకు తన సినీ జీవిత ప్రస్థానం గురించి రానా మాటల్లోనే తెలుసుకుందాం.
 
‘బాహుబలి’ రెండు భాగాల కోసం ఏడేళ్లు. అంటే నా కెరీర్‌లో సగభాగ కాలం అన్నమాట. ఏ నటునికైనా ఇది విలువైన సమయం. ఈ సినిమా వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తప్పలేదు. అయితే జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడు ఒకటి అర్థమైపోయింది.. ఇలాంటి సినిమాను ఇప్పటికైతే ఎవరు చేయలేరు. ‘ఈ సమయంలో నేను చేసే నాలుగైదు సినిమాలకంటే పేరు తెచ్చే ఈ సినిమా ఒక్కటే చాలు’ అనుకున్నాను. ఆ సంతృప్తే మమ్మల్ని ముందుకు నడిపించింది. ‘బాహుబలి’ విజయం కన్నా.. ఆ మహత్తర చిత్రం తీస్తున్నప్పుడు కలిగిన అనుభవం.. ఎన్నో నేర్పింది. ఎంతో సంతోషాన్ని అందించింది. 
 
ఘాజీ సినిమా చేయాలని ఎలా తట్టింది. ప్రేరణ ఏమిటి?
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ‘ఘాజీ’ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే భారతీయ చలనచిత్ర ప్రపంచంలోనే సముద్రగర్భంలో ప్రయాణించే సబ్‌మెరైన్‌ ఇతివృత్తంగా చేసుకుని వస్తున్న తొలి కథ కావడం వల్ల. దర్శకుడు కథ చెప్పినప్పుడు నేను కూడా ఆసక్తితో విన్నాను. భలే అనిపించింది. చరిత్రలో దాగున్న ఒక కొత్త కోణాన్ని బయటికి తీసి.. తెర మీద ప్రదర్శించే భాగ్యం కలగడం సంతోషాన్నిస్తోంది. అందులో నేను నేవీ ఆఫీసర్‌. 
ఎందుకో ఎవరూ సినిమా కథగా చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి వైజాగ్‌ వెళ్లినప్పుడల్లా సముద్రతీరంలో కొలువుతీరిన సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను. అలాంటి మెరైన్‌కు విశాఖతీరంలో ఒక యుద్ధ చరిత్ర ఉందన్న సంగతి నాకు తెలియదు. ఆ మాటకొస్తే చాలామంది వైజాగ్‌లో నివసించే వాళ్లకు కూడా తెలియకపోవచ్చు. అయితే అక్కడక్కడ చరిత్రలో దొరికే సమాచారం మాత్రం ఆసక్తి కలిగించేది. సముద్రజలాల్లో గుప్తంగా దాగున్న ఆ చరిత్రను తెర మీద ప్రదర్శించే అవకాశం ఇన్నాళ్లకు కలిగింది.