శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (10:47 IST)

సుచిత్రకు పిచ్చా..? నేను నమ్మను.. ఆమెది అలాంటి మనస్తత్వం కాదు: గీతా మాధురి

సుచీలీక్స్ అంటేనే ప్రస్తుతం సెలెబ్రిటీలు ప్రస్తుతం జడుసుకుంటున్నారు. సుచిత్ర ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, రానా, త్రిషల ఫోటోలు ట్విట్టర్లో లీకై వివాదానికి దారితీసింది. సినీ సెలబ్రిటీల వ్యక్తిగత అఫైర్లకు

సుచీలీక్స్ అంటేనే ప్రస్తుతం సెలెబ్రిటీలు ప్రస్తుతం జడుసుకుంటున్నారు. సుచిత్ర ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, రానా, త్రిషల ఫోటోలు ట్విట్టర్లో లీకై వివాదానికి దారితీసింది.  సినీ సెలబ్రిటీల వ్యక్తిగత అఫైర్లకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో సుచిత్ర పోస్ట్‌ చేసి సంచలనాలకు కేంద్ర బిందువైంది. ఈ నేపథ్యంలో సుచిత్ర మానసిక రోగి అంటూ.. సైకో అంటూ కొందరుఅంటున్నారు. 
 
కానీ తెలుగు గాయని గీతామాధురి ఈ వ్యవహారంలో సుచిత్రకు మద్దతుగా నిలిచింది. సుచిత్రకు పిచ్చి ఎక్కిందంటే తాను నమ్మనని స్పష్టం చేసింది. సుచిత్రది డిప్రెషన్‌కు లోనయ్యే బలహీన మనస్తత్వం కాదని అంటోంది. సుచిత్ర కేవలం గాయని మాత్రమే కాదని, రేడియో జాకీగా, రచయితగా ఆమె ప్రజ్ఞ అందరికీ తెలిసిందేనని గీతా మాధురి వెల్లడించింది. ఇంకా విచారణలో నిజానిజాలు బయటపడతాయని గీతామాధురి తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. సుచీలీక్స్‌లో రానా దగ్గుబాటి, త్రిష ఫోటోలు కూడా లీకయ్యాయి. రానాతో ప్రేమ లేదూ దోమ లేదని త్రిష చెప్తుంది. కానీ త్రిష చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పే ఫోటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రానా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతున్న త్రిష ఫోటోను చూసి.. అందరూ రానా, త్రిషల మధ్య ఏదో నడుస్తోందనే అంటున్నారు.