ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (17:16 IST)

నాకు ఇదే నిజమైన సంక్రాంతి : హీరో నాగశౌర్య

యువ హీరో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛలో'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగశౌర్య తన ఫేస్‌బుక్ ఖాతాలో

యువ హీరో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛలో'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగశౌర్య తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పష్టం చేశారు. మేరకు ఓ పోస్ట్ చేశాడు. 
 
"జనవరి 25న నిర్వహించే 'ఛలో' ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవిగారు అంగీకరించారు. భోగి పండగ సందర్భంగా ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్యూ సోమచ్ సార్" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ పోస్ట్‌తో క్లీన్ షేవ్‌తో ఉన్న చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను నాగశౌర్య జతపరిచాడు. ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి వస్తానని చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేవని నాగశౌర్య చెప్పినట్టుగానే ఆ ఫొటోలో అమితానందంతో నవ్వుతూ ఉన్నాడు.