షూటింగులో గాయపడిన హీరో ప్రభాస్!
టాలీవుడ్ హీరో ప్రభాస్ షూటింగులో గాయపడ్డారు. ఆయనకు చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడించారు. దీంతో "కల్కి" ప్రమోషన్స్‌కు తాను హాజరుకావడం లేదని చెప్పినట్టు సమాచారం. ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా, ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో తన చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడించారు.
తాను నటించిన 'కల్కి 2898ఏడీ' చిత్రం జపాన్‌లో జనవరి 3వ తేదీన విడుదలకానుంది. అయితే, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. ప్రమోషన్ ఈవెంట్స్‌లో డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు.
మరోవైపు, ప్రభాస్ గాయంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, 'కల్కి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన గణనీయమైన స్థాయిలో వసూళ్లు రాబట్టడం తెలిసిందే. ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇపుడీ చిత్రాన్ని జపాన్‌లోనూ విడుదల చేస్తున్నారు.