రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్
Donkey Attacks Man
ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రోడ్డుపై ఫోనులో మాట్లాడుతూ.. నడుస్తూ వెళ్తుండగా.. వెనక నిల్చున్న గాడిద అతనిపై దాడి చేసింది. అతని కాళ్లు పట్టుకుని కొరికింది. చాలా సేపటికైనా ఆ రోడ్డుపై మనుషులు లేకపోవడంతో ఆ వ్యక్తి గాలికి తీవ్రంగా గాయాలైనాయి. ఆపై రోడ్డున పోయే వాహనదారులు ఆ గాడిదను తరిమికొట్టారు. అప్పటికే ఆ వ్యక్తి కాలికి రక్త స్రావం జరిగింది.
కర్రలు, రాళ్లతో గాడిదని అక్కడ నుంచి తరిమి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మనిషితో గాడిదకు ఏ సమస్య వచ్చింది? అంటూ నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
What problem did the donkey have with this man? ???????????????? pic.twitter.com/iHTn1FG0Be
— Bipin Bajpai (@BipinBajpai18) November 29, 2024
