రూ.1 తో ఫ్లైట్ జర్నీ ఎలా సాధ్యం : "ఆకాశమే నీ హద్దురా" హీరో సూర్య ఏమన్నారంటే....

Akasam Nee Haddura Movie
ఠాగూర్| Last Updated: గురువారం, 29 అక్టోబరు 2020 (17:25 IST)
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఆకాశమే నీ హద్దురా". తమిళంలో 'సూరారై పోట్రు'. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా నిర్మించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని తొలుత అక్టోబరు 30 విడుదల చేయాలని భావించినా... అననుకూల పరిస్థితుల నేపథ్యంలో నవంబరు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది.
Akasam Nee Haddura Movie

అయితే, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేసింది. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించగా, హీరో సూర్యకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

డైలాగ్ కింగ్ మోహన్ బాబుతోపాటు, హీరోయిన్ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సంక్షోభంతో నిర్మాతలు వాయిదా వేశారు. అలాగే దీన్ని త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు
సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుకుంది.
Akasam Nee Haddura Movie

ఇకపోతే, ఈ చిత్రాన్ని సిఖ్య , 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించారు.

ఇదిలావుంటే, చిత్ర హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగరలు గురువారం వర్చ్యూవల్ మీడియా మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ, ఈ చిత్రం టేకింగ్ సూపర్బ్‌గా వచ్చిందన్నారు. నిజానికి ఇలాంటి చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలన్న భావించే వాయిదా వేస్తూ వచ్చామన్నారు. కానీ, పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయని, అయినప్పటికీ ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత ముందుకు వచ్చారని తెలిపారు.
Akasam Nee Haddura Movie

ఇందులో సీనియర్ నటులు మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్ వంటి లెజెండ్స్‌తో కలిసి తాను నటించడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఇది తనకు ఓ మంచి అవకాశమన్నారు. ఒక నటుడుగా వారి నుంచి ఎన్నో విషయాలను ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేర్చుకున్నట్టు తెలిపారు.

అలాగే, ఈ చిత్రం ద్వారా ఓ అద్భుతమైన సందేశాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, సొంత కాళ్ళపై ఎలా నిలబడాలి, ఎలా డబ్బులు సంపాదించాలి? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అనే కోణాలను టచ్ చేస్తున్నట్టు తెలిపారు. అదేసయమంలో డెక్కన్ ఎయిర్‌వేస్ అధినేత గోపీనాథ్ పతనమైపోవడానికి గల కారణాలను కూడా ఇందులో చూపించినట్టు హీరో సూర్య చెప్పుకొచ్చారు.
Akasam Nee Haddura Movie

ముఖ్యంగా, కేవలం ఆరు వేల రూపాయలు చేతిలో పెట్టుకున్న ఓ విమాన పైలెట్... విమాన కంపెనీని ఎలా స్థాపించారన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ముఖ్యంగా, ఇందులో డాక్టర్ మోహన్ బాబు పాత్ర అత్యంత కీలకంగా ఉంది. అలాగే, విమానం కొనేందుకు అప్పు ఇవ్వమని హీరో అడిగే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉన్నాయి.


ఇక సూర్య మాట్లాడుతూ.. 'ఆకాశం నీ హ‌ద్దురా' చిత్రం నాకు చాలా స్పెష‌ల్, ఎందుకంటే ఈ క‌థలో హీరో అంద‌రు అసాధ్యం అనుకున్నే దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ఇప్పుడు సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు కూడా విమానం ఎక్కి తిరుగుతున్నారంటే దానికి కార‌ణం డెక్క‌న్ ఏయిర్ వేస్ ఫౌండ‌ర్ జీఆర్ గోపీనాథ్, ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాలు కొన్ని తీసుకొని ఈ క‌థ‌ను చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు సుధ కొంగ‌ర‌, ఇది మ‌నంద‌రి క‌థ అందుకే అంద‌రికీ త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని అని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను. క‌రోనా కార‌ణంగా వ‌చ్చిన గ్యాప్ మా టీమ్‌కి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ టైమ్‌లో మా ప్రాజెక్టుకి కావాల్సిన గ్రాఫిక్స్, సీజీ వ‌ర్క్స్ మ‌రింత న్యాచుర‌ల్‌గా ఉండేలా డిజైన్ చేసుకునే వీలు క‌లిగింది. బెట‌ర్ అవుట్ పుట్ వ‌చ్చింద‌ని మేము భావిస్తున్నాం.
Akasam Nee Haddura Movie

ఎన్నో పాత్ర‌లు చేసాను, నా గ‌త చిత్రాలు గ‌జిని, సింగం, సూర్య స‌న్ ఆఫ్ క్రిష‌నన్‌లో చాలా వేరేయేష‌న్స్ ఉన్న గెటెప్స్ వేశాను, కానీ ఆకాశం నీ హ‌ద్దురాలో మాత్రం ఒక‌రు నిజ‌జీవితంలో చేసిన ప‌నుల్ని నేను అదే రీతిలో ఆన్ స్క్రీన్ చూపించాల్సి వ‌చ్చింది. నా పెర్ఫార్మెమెన్స్ విష‌యంలో ఎక్కువ దృష్టి పెట్టాను. ఓ సగ‌టు మ‌నిషిగా, ఓ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్‌గా ఇలా పలు ర‌కాలు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ సినిమాలు క‌నిపించ‌బోతున్నాను. ఈ క‌థ విన్నప్పుడు న‌న్ను ఎగ్జైట్ చేసింది కూడా ఈ చిత్రంలో నా పాత్ర స్వ‌భావ‌మే, సుధ డైరెక్ష‌న్ స్కిల్స్‌తో పాటు సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలు క‌లిసిక‌ట్టుగా వారిలో ఉన్న పూర్తి నైపుణ్యాన్ని పెట్టి ఈ సినిమాకి వ‌ర్క్ చేశారు.

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ మిస్ అవుతున్నా ఇంట్లో ఫ్యామిలితో కలిసి హాయిగా హోమ్ థియేట‌ర్ లో లేదా టీవిల్లో సినిమాను ఆస్వాదించే వీలు క‌లుగుతుంది ఓటిటిలు కార‌ణంగా, ఇందులో అమెజాన్ వారు ఆడియెన్స్ కి ఎంట‌ర్ టైన్మెంట్ ని మ‌రింత ద‌గ్గ‌ర చేస్తున్నారు. అంటే నేనే ఓటిటిల‌కు స‌పోర్ట్ చేస్తూ థియేట‌ర్స్ ని త‌క్కువ చేస్తున్న‌ట్లు కాదు. నా బ్యాన‌ర్ లో ఇంకా ప‌ది సినిమాలు ప్రొడ‌క్ష‌న్ లో ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వారి కోసం నేను కొన్ని సాహ‌స‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాలి, ప్ర‌స్తుతం ప‌రిస్థుతుల్లో నేను తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ద‌ని నేను భావిస్తున్నాను. న‌వంబ‌ర్ 12న ఆకాశం నీ హ‌ద్దురా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అవుతుంది. చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్ష‌కుల న‌న్ను నా టీమ ని ఆదిరించాల‌ని కోరుకుంటున్నాను అని సూర్య చెప్పుకొచ్చారు.
Akasam Nee Haddura Movie

ఇకపోతే ఈ చిత్ర దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ, గోపీనాథ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నపు తనకు కలిగిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్ర కథను తయారు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, ఒక్క రూపాయికే విమాన ప్రయాణం కల్పించడం అనేది పెను సాహసమేనని చెప్పారు. ఇది విమానం ఎక్కాలని కలలుగనే కోట్లాది మందికి కల, ఆశలు నెరవేర్చుతుందన్నారు. అలాంటి వ్యక్తి గోపినాథ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఒకవేళ ఈ చిత్రం సీక్వెల్ చేసినా అందులో హీరో సూర్యనే నటిస్తారని దర్శకురాలు సుధ కొంగర చెప్పుకొచ్చారు.

గోపీనాథ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నపు తనకు కలిగిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్ర కథను తయారు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, ఒక్క రూపాయికే విమాన ప్రయాణం కల్పించడం అనేది పెను సాహసమేనని చెప్పారు. ఇది విమానం ఎక్కాలని కలలుగనే కోట్లాది మందికి కల, ఆశలు నెరవేర్చుతుందన్నారు. అలాంటి వ్యక్తి గోపినాథ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఒకవేళ ఈ చిత్రం సీక్వెల్ చేసినా అందులో హీరో సూర్యనే నటిస్తారని దర్శకురాలు సుధ కొంగర చెప్పుకొచ్చారు.
Akasam Nee Haddura Movie

అలాగే, సూర్య చెప్పిన‌ట్లుగా ఈ సినిమా మా టీమ్ అంద‌రికీ ఎంతో ప్ర‌త్యేకం ఎందుకంటే ఈ సినిమా క‌థ మొత్తం ఓ సాధ‌ర‌ణ మ‌నిషి చేసిన అసాధార‌ణ పని చుట్టే తిరుగుతూ ఉంటుంది. రూపాయి ఇస్తే చాలా విమానం ఎక్కేయ‌వ‌చ్చు అనే న‌మ్మ‌కాన్ని జనాల్లో క‌లిగించిన వ్య‌క్తి గురించి ఈ సినిమా చెబుతోంది. సూర్య ఆన్ స్క్రీన్ గోపీనాథ్‌గా ఒదిగిపోయారు. లాక్డౌన్ కార‌ణంగా మా టీమ్ మొత్తానికి కావాల్సినంత టైమ్ దొరికింది, ఆడియెన్స్ మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా ఈ సినిమాను మేము రెడీ చేయ‌గ‌లిగాము.

అండ‌ర్ డాగ్ క‌థ‌లు అంటే నాకు చాలా ఇష్టం, హీరో అంటే ఇట్టే కొట్టేసి అట్టే గెలిచేసి వెళ్లిపోతే నాకు న‌చ్చుదు. ఈ క‌థ‌లో హీరో కూడా త‌ను అనుకున్నది సాధించ‌డానికి ప‌డ్డ క‌ష్టాల్లోంచి మ‌నంద‌రం ఎంతో కొంత నేర్చుకోవ‌చ్చు. ఇదే ఎజెండా నేను ఈ సినిమాను తెర‌కెక్కించాను. ఎప్పుడో 10 ఏళ్ల త‌ర్వాత ఓటిటిల ప్ర‌భావం ఉంటుందని నేను అనుకున్నాను, కానీ మనంద‌రికి వ‌చ్చిన ఈ విపత్తు కార‌ణంగా ఓటిటిలు ముందుకు వ‌చ్చాయి. ఇలా రావ‌డం కూడా మంచిదే, ఆడియెన్స్‌ని ఎంట‌ర్‌టైన్మెంట్ నుంచి దూరం అవ్వ‌కుండా ఓటిటిలు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అయితే థియేట‌ర్స్ మ‌ళ్లీ ఓపెన్ అయ్యాక ఆడియెన్స్ ఈ రెండు మీడియ‌మ్స్‌లో సినిమాలు చూస్తారని ఆమె చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :