ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 12 జులై 2017 (03:52 IST)

పవర్ స్టార్ అభిమానుల మేనియాను ఎలా అర్థం చేసుకోవాలి.. మంచిగానా, చెడుగానా?

దేశం మొత్తం మీద ఒక నటుడిని అభిమానులు ఈ స్థాయిలో నెత్తిన పెట్టుకుని ఆరాధించడం పవన్ విషయంలో జరిగినట్లుగా మరే నటుడి విషయంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.. "పవర్ స్టార్ ఫ్యాన్స్ మరీ శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు.. ఏ ఒక్కరి ఆడియో లాంచింగ్ ప్రోగ్రాంని సజా

దేశం మొత్తం మీద ఒక నటుడిని అభిమానులు ఈ స్థాయిలో నెత్తిన పెట్టుకుని ఆరాధించడం పవన్ విషయంలో జరిగినట్లుగా మరే నటుడి విషయంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.. "పవర్ స్టార్ ఫ్యాన్స్ మరీ శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు.. ఏ ఒక్కరి ఆడియో లాంచింగ్ ప్రోగ్రాంని సజావుగా, స్మూత్‌గా సాగనివ్వకుండా గోల గోల చేస్తున్నారు.. ఇదేం పద్దతి" అని చాలామంది సినీరంగ ప్రముఖులు కూడా నొసలు విరుస్తున్నా సరే పవర్ స్టార్‌పై ఇలాగే అభిమానం చూపిస్తాం.. ఎవ్వరడ్డమొచ్చినా సరే  మా దారి ఇదే.. ఆ రూట్ ఇదే అంటూ సంవత్సరాలుగా పవన్ కల్యాణ్ అభిమానులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు?
 
చివరకు మెగా ప్యామిలీ కుటుంబం కూడా ఈ విషయంపై రెండుగా చీలిపోయినా, ఒక దశలో పవన్‌ని చిరు ఫ్యామిలీ మెగా వారసులంతా దూరం పెట్టినా లెక్కచేయకుండా అభిమానులు పవన్ వెంట నిలిచారు? ఎందుకు? చిత్రసీమలో చాలామంది పవన్ అభిమానుల వైఖరిని తప్పుపడుతున్నా వాళ్లెందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఇది ఎవరికీ అంతుబట్టని ప్రశ్నగానే ఉంటోంది. 
 
కాస్త లోతులోకి వెళితే పవన్‌కు ఫ్యామిలీ పరంగా జరిగిన అన్యాయం తన అభిమానుల కడుపు మండించినట్లు ఒక వెర్షన్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ స్వయంగా చెప్పినట్లుగా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తూ కుటుంబంలోనే ఒంటరివాడైపోయిన సంక్షోభ కాలంలో పవన్ అనుభవించిన బాధ, పడ్డ క్షోభను తన అభిమానులు ఈరోజుకీ మర్చిపోనట్లు కనిపిస్తోంది. 
 
పవన్‌కు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని బలంగా నమ్మతూ వచ్చిన అభిమానులు తమ హీరో మీద ఈగ వాలితే సహించమన్నంత రెబెల్ నేచర్‌లోకి, మిలిటెంట్ స్వభావంలోకి వెళ్లిపోయారనిపిస్తుంది. ఆ రెబెల్ తత్వం ఏమిటంటే ప్రపంచాన్ని లెక్క చేయని తనం. ఎవరేమనుకున్నా తమ అభిమానుడి పట్ల ఇలాగే వ్యవహరిస్తాం. ఏ సభలో అయినా సరే పవన్ తర్వాతే తక్కిన వారికి ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎవరిమాటా వినం. పవన్ గురించి మాట్లాడక పోతే ఆ సభను కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ సజావుగా జరగనియ్యబోం అంటూ మొండితనంతో వ్యవహరించడానికి బలీయమైన కారణం ఇదేననిపిస్తుంది.
 
అందుకే సోమవారం ఫిదా చిత్రం ఆడియో కార్యక్రమంలో ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం పవన్ కల్యాణ్ అభిమానుల తాకిడికి గురికాక తప్పలేదు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకపోతే సభ జరగనివ్వం అన్న రేంజిలో వారు నినాదాలు చేయడంతో ఇంత అభిమానం నేను ఊహించలేదంటూనే చివర్లో పవన్ గురించి మాట్లాడతానని శేఖర్ కమ్ముల చెబితే గానీ పవన్ అభిమానులు సద్దుమణగలేదు.
 
ఒకటి మాత్రం నిజం. మంచికైనా, చెడుకైనా సరే... పవర్ స్టార్ అభిమానుల మేనియా సమీప భవిష్యత్తులో కూడా ఆగదు. పవన్‌ కల్యాణ్‌పై ఈగ వాలినా సహించని అభిమానం అభిమానుల్లో ఉన్నంత వరకు వారిని ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. చాలా మందికి వారి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ స్వయంగా పపనే వచ్చి అలా వ్యవహరించవద్దు అని మందలిస్తే తప్ప పవన్ అబిమానులు తగ్గరు, తగ్గబోరు. అంతవరకు పవన్ అబిమానులు కనిపించని పవర్ స్టార్ శత్రువుతో వేదికలపై యుద్ధం చేస్తూనే ఉంటారు.