మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జూన్ 2016 (16:05 IST)

వరుణ్‌తో కెమిస్ట్రీ కుదిరింది.. అప్పుడప్పుడు పార్టీలకు పిలుస్తాడు: నర్గీస్ ఫక్రీ

అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్‌తో రాక్ స్టార్ సినిమా ద్వారా బాలీవుడ్‌ తెరంగేట్రం చేసిన అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీ.. ఆపై మద్రాస్ కేఫ్, అజహర్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్-3లో నటించింది. కానీ తాను బాలీవుడ్‌లో సరిగ్గా ఇమడలేకపోతున్నానని చెప్తోంది. 
 
అమెరికాలో తనకు తెలియని నటులతో నటించాల్సి వచ్చినా.. దానికోసం బాగా కష్టపడేదాన్ని.. కానీ బాలీవుడ్‌లో తాను ఇమడలేనని అనిపిస్తోంది. అయితే ‘మే తేరా హీరో’లో వరుణ్ ధావన్‌తో నటించిన తర్వాత బాలీవుడ్ నటుల్లో వరుణ్‌తో మంచి సంబంధం ఏర్పడటమే కాకుండా మా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని నర్గీస్ ఫక్రీ చెప్పుకొచ్చింది. వరుణ్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. కలిసిన ప్రతీసారీ పలకరిస్తాడని.. అప్పుడప్పుడు పార్టీలకు పిలుస్తుంటాడని వెల్లడించింది.