సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 మార్చి 2017 (14:19 IST)

అతడి ఇగో మీద దెబ్బకొట్టా... తప్పుగా మాట్లాడా... వదిలించుకున్నా... నటి మాధవీలత

సినిమా నటీనటుల్లో నటీమణులకు చాలా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు నటీమణులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నటి మాధవీలత తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలన

సినిమా నటీనటుల్లో నటీమణులకు చాలా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు నటీమణులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నటి మాధవీలత తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ఓ పత్రికతో పంచుకుంది. 
 
తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఓ బోయ్‌ఫ్రెండ్ వుండేవాడనీ, అతడు తన కేరింగ్ తీసుకునేవాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు... ఓ రోజు అతడు అకస్మాత్తుగా తనను లవ్ చేస్తున్నట్లు చెప్పాడట. దానితో ఒకింత షాక్ కు గురయ్యాననీ, ఐతే తేరుకుని తనకు అలాంటి దృష్టి లేదనీ, స్నేహితులుగా వుండిపోదామని చెప్పానని వెల్లడించారు.
 
ఐతే అతడు అప్పుడు తనతో ఓ మాట అన్నాడనీ, అది ఎప్పటికీ మర్చిపోలేననీ చెప్పిన మాధవీ... ఓ అబ్బాయి ఓ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పాక తిరిగి ఓ ఫ్రెండుగా చూడటం జరగదని చెప్పాడు. అతడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనని నాకనిపించడంతో అతడిని వదిలించుకోవాలనుకుని, అతడి ఇగో దెబ్బతినే మాటలు మాట్లాడి, తన వద్ద నుంచి వెళ్లిపోయేట్లు చేశానని చెప్పుకొచ్చింది మాధవీలత.