మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (15:28 IST)

సింగర్ సునీతతో అభిప్రాయబేధాలు మాత్రమే.. పోట్లాడుకోం: కౌసల్య

సింగర్ సునీతతో తనకు గొడవలున్నాయని.. ఆమెను తాను ఎడమొహంగా వుంటామని వచ్చిన వార్తల్లో నిజం లేదని మరో గాయని కౌసల్య చెప్పుకొచ్చింది. సునీతతో తనకు స్నేహమూ లేదు.. శత్రుత్వమూ లేదని కౌసల్య క్లారిటీ ఇచ్చింది. ఆమ

సింగర్ సునీతతో తనకు గొడవలున్నాయని.. ఆమెను తాను ఎడమొహంగా వుంటామని వచ్చిన వార్తల్లో నిజం లేదని మరో గాయని కౌసల్య చెప్పుకొచ్చింది. సునీతతో తనకు స్నేహమూ లేదు.. శత్రుత్వమూ లేదని కౌసల్య క్లారిటీ ఇచ్చింది. ఆమెతో కేవలం అభిప్రాయభేదాలేనని కౌసల్య తెలిపింది. సూపర్ సింగర్ ప్రోగ్రామ్ సందర్భంగా ఓ పాట పాడినప్పుడు ఆమె తనకు 50 మార్కులే వేశారని.. మిగిలిన జడ్జిలు 90, 95 వేస్తే.. ఆమె పాడిన పాట కావడంతో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారని.. దాని ప్రకారమే మార్కులు వేసినట్లు చెప్పారు.
 
సాధారణంగా సింగర్స్ మధ్య స్నేహం ఉండదని.. వారి మధ్య సంగీతమే స్నేహంగా వుంటుందని చెప్పారు. కానీ ఎక్కడైనా కలిస్తే మాత్రం సింగర్స్ స్నేహితులుగా కనిపిస్తామన్నారు. గాయకులకు సాధారణంగా ఎక్కడపడితే అక్కడ రికార్డింగ్‌కు వెళ్తారని.. అలాంటప్పుడు వారికి కలుసుకునే అవకాశం చాలా తక్కువగా వస్తుందని.. సింగర్స్ స్నేహితులుగా చాలామటుకు వుండరని.. వృత్తిపరంగా వారు ఏకమైనట్లు కనిపిస్తారని చెప్పుకొచ్చారు. కాగా కౌసల్య 1999లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటిదాకా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400 పాటల్ని పాడారు. 3 నంది అవార్డులు, 2 సినీగొయర్ అవార్డులు అందుకున్నారు.