ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (08:56 IST)

సుస్మితతో బంధం తెగిపోయాక... సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా : బాలీవుడ్ డైరక్టర్

బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌తో ఉన్న ఎఫైర్ ముగిశాక ఆత్మహత్య చేసుకోవాలని భావించానని వెల్లడించాడు. అలాగే, సుస్మితతో కలిసి తాను తన భార

బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌తో ఉన్న ఎఫైర్ ముగిశాక ఆత్మహత్య చేసుకోవాలని భావించానని వెల్లడించాడు. అలాగే, సుస్మితతో కలిసి తాను తన భార్యాపిల్లలను మోసం చేసినట్టు చెప్పారు. ఇది ఇపుడు ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు. 
 
ఇదేవిషయంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... తన భార్యతో విడిపోయిన తర్వాత తాను, నటి సుస్మితా సేన్ ప్రేమించుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా అగ్రతారగా రాణిస్తున్న రోజుల్లోనే ఆమెతో ప్రేమలో మునిగితేలినట్టు వెల్లడించారు. 
 
అయితే, ఆమెతో బ్రేకప్‌ అయ్యిందన్నాడు. అదేసమయంలో తాను తెరకెక్కించిన 'గులాం' సినిమా విడుదల కావాల్సివుండగా, మరోవైపు కూతురితో చాలా మిస్యయ్యానని, ఈ ఆలోచనలతో తనకు సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని మనసులోని మాటను బయటపెట్టాడు.