అబ్బాయిలు ప్రతీ 5 సెకెన్లకు ఓసారి సెక్స్ గురించే ఆలోచన చేస్తారు : ఇలియానా
అబ్బాయిల గురించి గోవా బ్యూటీ ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల, అమ్మాయిల ఆలోచనా విధానంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అబ్బాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి శృంగారం గురించే ఆలో
అబ్బాయిల గురించి గోవా బ్యూటీ ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల, అమ్మాయిల ఆలోచనా విధానంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అబ్బాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి శృంగారం గురించే ఆలోచిస్తార’ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలియానా. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే అమ్మాయిల విషయానికి వస్తే... శృంగారంతోపాటు చెప్పులు, బట్టలు, ఆహారం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు.
‘నేను జిమ్‌కు వెళ్లాలా? అతను నా ఫోటోకు ఎందుకు లైక్ కొట్టలేదు? నేను నా పెదవులకు ఇంజక్షన్ చేయించుకోవాలా? ఈ ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయా? నా కనుబొమ్మలు ఎలా కనబడుతున్నాయి? నా ఇంటి పేరు ఎక్కడ పెట్టుకోవాలి? మరీ తొందరగా వైన్ తాగుతున్నానా?లాంటి విషయాల గురించి అమ్మాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి ఆలోచిస్తారు. అందుకే అమ్మాయిలు అంత క్రేజీగా ఉంటార’ని ఇలియానా కామెంట్స్ చేశారు.