సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (10:27 IST)

కమల్ హాసన్ 'భారతీయుడు-2' చిత్రంలో 85 యేళ్ల వృద్ధురాలి పాత్రలో కాజల్!

విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "భారతీయుడు". ఈ చిత్రం సీక్వెల్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు సంబంధించిన లుక్స్ కూడా తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. భోపాల్‌లో హైయాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. పీట‌ర్ హెయిన్ సారథ్యంలో రూపొందుతున్న సీన్స్ హాలీవుడ్ లెవ‌ల్‌లో ఉంటాయ‌ని అంటున్నారు. 
 
చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఆమె 85 ఏళ్ళ ముస‌లావిడ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇది కాజ‌ల్‌కి ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిత్రంలో 90 ఏళ్ళ వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.
 
రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అంటే హిందీ, తెలుగు, తమిళంతో పాటు.. మరికొన్ని భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.