సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (18:02 IST)

టికెట్ల రేట్ల‌పై అర్హ‌త‌లేనివారు మాట్లాడుతున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bhardwaja
`థియేట‌ర్ల‌లో టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపి ప్రభుత్వానికి ఉంటుంది` అని ప్ర‌ముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్ప‌ష్టం చేశారు. గ‌త కొద్దిరోజులుగా థియేట‌ర్లు, సినిమా టిక్క‌ట్లు, పెద్ద సినిమాలు ఆగిపోవ‌డం వంటివాటిపై ప‌లువురు ప‌లుర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భరద్వాజ బుధ‌వారం ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు.
 
ఆయ‌న మాట్లాడుతూ, ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వున్నా ముందు మీడియా స‌మ‌న్వ‌యం పాటించాలి. సంబంధంలేని వ్యక్తుల‌తో చ‌ర్చాగోష్టిలు జ‌ర‌ప‌డం వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌టిలంగా వుంటుంది. దానికి మీడియా జ‌వాబుదారిత‌నం వ‌హించాలి. అదేవిధంగా  సినిమా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వానికి తెలియ‌జేసే హ‌క్కు ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌కే వుంది. కోర్టు ద్వారా ఎంపిక చేసిన ఛాంబ‌ర్‌లోని కొంద‌రు స‌భ్యులు ఎ.పి. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కొద్ది రోజులే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం. చాలామంది ఫెడ‌రేష‌న్ వుందిక‌దా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ వుంది క‌దా వారేమీ మాట్లాడ‌రా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అవి ఇండిపెండెంట్ బాడీలు మాత్ర‌మే. ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు ఛాంబ‌ర్ మాత్ర‌మే. వారే ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిచంచ‌గ‌ల‌వు అని వెల్ల‌డించారు. 
 
ఆంధ్ర‌లో 10,5 రూపాయ‌లు టికెట్ పెడితే అది త‌ప్ప‌ని చెప్పాం. 40 రూపాయ‌లు చేయాల‌ని మెమొరాండం ఇచ్చాం. మొన్న మీటింగ్‌లో కూడా చ‌ర్చించాం. త్వ‌ర‌లో మ‌రో మీటింగ్ జ‌రిగి స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.
 
ఇక పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డం అనేది కేవ‌లం క‌రోనా థార్డ్ వేవ్ వ‌ల్ల‌నే. అవి పాన్ ఇండియాలు సినిమాలు కాబ‌ట్టి పెట్టిన కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి రావాలంటే సాధ్య‌ప‌డం కాబ‌ట్టి వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క వంటి చోట్ల 50శాతం ఆక్యుపెన్సీ వుంది. అంతే త‌ప్పా ఎ.పి.టిక్క‌ట్ల రేట్ల‌కు పెద్ద సినిమాల వాయిదాకు ఎటువంటి సంబంధంలేదు.
 
ఇటీవ‌లే ఓ రాజ‌కీయ‌నాయ‌కుడు సినిమావారిని నిందిచ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింది. ఇండస్ట్రీ వారికీ సిగ్గులేదు, దమ్ము లేదు. సినిమా వారికి బలిసిందని అంటున్నారు. ఇక్క‌డ ఎవ‌రికీ బ‌లుపులేదు. ఇక్క‌డ  అందరూ  దైర్యవంతులే, సామరస్యం గా సమస్య ను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతేకానీ మీలా రెచ్చ‌గొట్ట‌ధోర‌ణి మాది కాదు. కొంత‌మంది ఎవ‌రి మెప్పుకోసం త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా త‌ప్పు.  ఇక మ‌రో వ్య‌క్తి ప్రొడక్ట్ కు ధర నిర్ణయించుకునే అవకాశం నిర్మాతలకూ ఉంటుంది అన్నారు. అది క‌రెక్టే. అదేవిధంగా ప్ర‌భుత్వానికి కొన్ని రూల్స్ వుంటాయి. వాటి ప్ర‌కార‌మే టిక్క‌ట్ రేటు కూడా పెంచుకునే అవ‌కాశం వుంటుంది. ఇలా భిన్న‌మైన వాతావ‌ర‌ణ వున్న‌ప్పుడు చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది త‌ప్ప అవాక‌కులు చెవాకులు పేలితే స‌మ‌స్య మ‌రింత జ‌టిల‌మ‌వుతోంది. ఇందుకు మీడియాకూడా స‌మ‌న్వ‌యం పాటించాల‌ని సూచించారు.