శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (15:16 IST)

అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటున్న 'దేవసేన'

అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె యోగా తన జీవితంలో తెచ్చిన మార్పులను సోషల్ మీడియా ద్వారా వివరించింది. యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫోటోను పోస్టు చే

అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె యోగా తన జీవితంలో తెచ్చిన మార్పులను సోషల్ మీడియా ద్వారా వివరించింది. యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫోటోను పోస్టు చేసిన ఆమె, దానిపై తన జీవితంలో యోగా తెచ్చిన మార్పును గుర్తుచేసుకుంది.

 
ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌లో 'యోగా టీచర్‌గా మారాలన్నది నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. డాక్టర్లు, ఇంజినీర్లు గల ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి అందరికీ విభిన్నంగా యోగా ఎంచుకోవడం సాహసోపేతమే. అయితే నా జీవితంలో చోటుచేసుకున్న పెను మార్పులకు యోగాయే కారణం. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్‌ యోగా డే’ అంటూ ధ్యానం చేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది.