సోమవారం, 3 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 3 మార్చి 2025 (15:14 IST)

GV Prakash: జీవి ప్రకాష్‌ బద్దకిష్టా? ఎన్ని గంటలకు నిద్రలేస్తాడో తెలుసా !

GV Prakash
GV Prakash
తమిళరంగంలో సంగీతదర్శకుడిగా నటుడిగా పేరుతెచ్చుకున్న జీవి ప్రకాష్‌ కుమార్‌ తెలుగులో పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. తాజాగా ఆయన నిర్మాతగా కూడా మారాడు. సముద్రంలో నిధినిక్షేపాలు శోదించే కథకు  థ్రిల్లర్‌ అంశాలు జోడించి కింగ్‌ స్టన్‌ సినిమా చేశాడు.

మార్చి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు దైవభక్తి ఎక్కువే  అన్నారు. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌ గా వుండే ఆయన సంగీతంలో ఇళయరాజా, రెహామాన్‌ లను స్పూర్తిగా తీసుకున్నాడు. కొంతమంది సీఁయర్స్‌ను ఆదర్శంగా తీసుకుని మెళుకఁవలు నేర్చుకున్నాని గతంలో చెప్పాడు. 
 
సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇన్ని పనులు ఎలా చేయగలిగారంటే.. అంతా దైవ కృ ప అంటున్నారు. మరి మీ దైనందిక జీవితం ఎప్పుడు ప్రారంభిస్తారనేందుకు,. తాను ఉదయం 9.30 గంటలకు నిద్రలేస్తాననీ, అది కూడా షూటింగ్‌ లేకపోతేనే. అంటూ, ఆలస్యం అయినా దేవుడి పూజా చేసుకుం టానని సెలవిచ్చారు. చాలామంది సీనీ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా తెల్లవారిజామున లేచి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వెంటటెష్  అయితే తెల్లవారినే లేచి విశ్వంతో మమేకం అవుతాని చెప్పేవారు. ఇటీవేల ఓ హీరోయిన్‌ కూడా సూర్యోదయానికి ముందే లేచి రోజు వారి పనులు మొదలుపెదతానని  చెప్పింది. మరి జీవి ప్రకాష్‌ మాత్రం  టైంతో సంబంధంలేకుండా ఎప్పుడైనా నిద్రలేస్తాననీ, అయినా దేవుని దయ నామీద వుందని అంటున్నాడు. అయితే జీవితంలో ప్రతీదీ పోరాటమే అని, ఆ పోరాట పటిమ ఒక్క ఆధ్యాత్మిక మార్గం వల్లే లబిస్తుందని తెలియజేస్తున్నారు.