నిజంగానే సినీ పరిశ్రమ సరైన మార్గంలో పయనిస్తోందా?: ఇళయరాజా
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమపై ఇళయ రాజా కామెంట్స్ చేశారు. ప్రస్తుత సినీ పరిశ్రమ ఎటు పయనిస్తుందో ఎవరికీ
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమపై ఇళయ రాజా కామెంట్స్ చేశారు. ప్రస్తుత సినీ పరిశ్రమ ఎటు పయనిస్తుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. నిజంగానే సినీ పరిశ్రమ సరైన మార్గంలో పయనిస్తోందా? లేకుంటే దారి తప్పి పయనిస్తోందా? అనే సంగతి ప్రేక్షకులకు, నిర్మాతలకు ఏమాత్రం తెలియడం లేదని చెప్పుకొచ్చారు.
ఓ సాధారణ యధార్థ కథను భావావేశంతో చెప్పే విధానం ప్రస్తుత సినీ ప్రపంచంలో కనుమరుగవుతుందని ఇళయరాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా అనేది ఓ వినోదాత్మక అంశమే అయినప్పటికీ మంచి విషయాలతో చక్కని కథాంశాన్ని పూర్తి వైవిధ్యంగా.. ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు.
కబాలి తర్వాత నటి దన్షిక నటిస్తున్న ఎంగ అమ్మ రాణి.. అనే సినిమాకు సంగీతం సమకూర్చిన ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అయితే ఎంగ అమ్మ రాణి అనే సినిమా వైవిధ్యంగా ఉందని.. వైవిధ్యంగా ఉండటంతోనే దానికి సంగీతం సమకూర్చానని తెలిపారు.
ఈ చిత్రంలోని తల్లి తన బిడ్డ కోసం ఎవరూ చేయని త్యాగం చేస్తుందని, అదే ఈ చిత్రం వైవిధ్యమని పేర్కొన్నారు. సాధారణంగా తాను సంగీతం సమకూర్చిన చిత్రం గురించి మాట్లాడనని, ప్రేక్షకులే సినిమాను చూసి నిర్ణయించాలని తెలిపారు. ఈ సినిమాలో తల్లి గురించి పాడిన పాటకు కట్టిన బాణీ అందరికీ నచ్చుతుందన్నారు.