'జనతా గ్యారేజ్'.. అది జనెటిక్ ప్రాబ్లమ్... అది నా ఫెయిల్యూరే : కొరటాల శివ
'జనతా గ్యారేజ్' సినిమాను అందరూ బాగా ఆదరిస్తున్నారని.. మొదటిరోజు కలెక్షన్లు.. 'శ్రీమంతుడు' కంటే ఎక్కువగా వచ్చాయని.. ఇదే నిదర్శనమని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. గురువారం విడుదలైన ఈ సినిమ
'జనతా గ్యారేజ్' సినిమాను అందరూ బాగా ఆదరిస్తున్నారని.. మొదటిరోజు కలెక్షన్లు.. 'శ్రీమంతుడు' కంటే ఎక్కువగా వచ్చాయని.. ఇదే నిదర్శనమని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. గురువారం విడుదలైన ఈ సినిమా గురించి.. శుక్రవారం వివరాలను తెలిపేందుకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల నుంచి, నాకు తెలిసిన బంధువుల నుంచి, ఎన్‌టిఆర్ అభిమానుల నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. వారంతా ఒక్కటే మాట.. బాగా తీశారని కితాబిచ్చారు.
అయితే సినిమా రివ్యూలను రాసేవారు.. కొందరు ఒక విషయాన్ని టచ్ చేశారు. నేచర్ లవర్... మరదలును ప్రేమించడం కరెక్ట్‌కాదని అన్నారు. దానివల్ల జనెటిక్ ప్రాబ్లం వస్తుందని రాశారు. నేను అంతగా ఆలోచించలేదు. ఈ విషయంలో నా ఫెయిల్యూర్‌గా భావిస్తున్నానని అన్నారు. ఈ సినిమాను 2 వేల థియేటర్లలో విడుదల చేశాం. ఓవర్‌సీస్‌లో 'శ్రీమంతుడు'ను బ్రేక్ చేసిందని తెలిపారు.
సినిమాను కొన్న బయ్యర్లు చాలా హ్యాపీగా వున్నారు. వారి కాంప్లిమెంట్‌కు షాక్ అయ్యాను. సందేశంతోపాటు కమర్షియల్‌గా తీసినా మంచి సినిమా తీశారని చెబుతుండే ఆనందం కల్గిందని చెప్పారు. ముందుగా కథను విన్నప్పుడు ఎంత ఆనందించాలరో ఎన్‌టిఆర్.. సినిమా రిజల్ట్ తర్వాత కూడా అలానే వున్నారని చెప్పారు. మోహన్‌లాల్, ఎన్‌టిఆర్ పోటీపడి నటించారని ఎవరు గొప్ప అనేది కనబడలేదని అన్నారు.