ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ఉంది... గూగుల్‌కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి: అనసూయ స్ట్రాంగ్ రిప్లై
సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాటల్లో అనసూయ ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్‌గా ఉన్నా.. కొ
సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాటల్లో అనసూయ ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్‌గా ఉన్నా.. కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. ఆ పాటలో బుద్ధుడి విగ్రహం ముందు అనసూయ డ్యాన్స్‌లు వేసింది. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడమేంటని చాలామంది అనసూయను నెటిజన్లు ఏకిపారేశారు. దీనికి అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 'ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని బుద్ధ బార్‌లో చిత్రీకరించారు. ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ముందే అందరూ తాగుతారు. మేం అక్కడ ఆ విగ్రహం పెట్టలేదు. గూగుల్‌కి వెళ్లి ఎంక్వైరీ చేసుకోండి. అక్కడి వాళ్లకు బుద్ధుడి విగ్రహం ముందు తాగడం తప్పు కానప్పుడు.. మేం ఓ పాట షూట్ చేస్తే తప్పేంటి? ఇతరులను గౌరవించడం చేత కాని వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేద'ని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.