సీన్లోకి పవన్.. సంక్రాంతి శుభాకాంక్షలు.. చిరంజీవి చూసి నేర్చుకోమన్న వినాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని,ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలుగజేయాలన్నారు. కరెన్సీ రద్దు వంటి గాయాల బారిన పడకుండా, రాజకీయ పెద్దల నుంచి సంక్రాంతి పండగ ప్రజలను కాపాడాలని పవన్ కోరుకున్నారు.
ఇదిలా ఉంటే.. పట్టుదల ఉంటే సరిపోతుందని లక్ష్యం చేరేందుకు వయస్సుతో పనిలేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్‌ను చూసి ఫీలయ్యేవాడినని, ఆ తర్వాత చిరంజీవిని చూసే ఫీలవుతున్నానని ‘ఖైదీ నంబరు 150’ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్ అన్నారు. చిరంజీవిని యువ హీరోలు మార్గదర్శకంగా తీసుకోవాలి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేసినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు కనపడలేదు. ఫారిన్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు చిరంజీవి 14 గంటల పాటు పనిచేశారని వినాయక్ తెలిపారు. యువ దర్శకులందరికి చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రావాలని వినాయక్ ఆకాంక్షించారు.