శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (10:15 IST)

మళ్లీ మేకప్ వేసుకోనున్న జయప్రద.. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో...

ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో జయప్రద నటించనుంది. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేసిన జయప్రద.. మలయాళ

ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో జయప్రద నటించనుంది. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేసిన జయప్రద.. మలయాళ ఫిల్మ్ మేకర్ ఎంఏ నిషాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ''కెని'' చిత్రంలో నటించనుంది. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజల మధ్య నెలకొన్న నీటి సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 
 
1956లో కేరళ రాష్ట్రం ఏర్పడింది. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో ఉండే బావి తమదంటే తమదంటూ రెండు రాష్ట్రాల ప్రజలు గొడవకు దిగుతారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. 
 
తమిళ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తీపన్ ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. తెలుగు తెరపై దశాబ్ధాల పాటు కనిపించి.. బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ముద్రవేసుకుని.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వనుండటంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కమల్ హాసన్ దశావతారంలో జయప్రద నటించిన సంగతి తెలిసిందే.