బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (14:46 IST)

సోదరి మృతి: గంటల్లోనే టెలివిజన్ నటి డాలీ సోహి మరణం

Dolly Sohi
Dolly Sohi
టెలివిజన్ నటి డాలీ సోహి, ఆమె సోదరి అమన్‌దీప్ సోహి మరణించారు. మార్చి 8, శుక్రవారం, డాలీ, ఆమె సోదరి అమన్‌దీప్ మరణించినట్లు ధ్రువీకరించారు. డాలీ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతుండగా, అమన్‌దీప్ జాండిస్‌తో పోరాడుతూ మరణించింది. వారి మరణ వార్తలను సన్నిహితులు ధ్రువీకరించారు. 
 
"మా ప్రియమైన డాలీ ఈ రోజు తెల్లవారుజామున మరణించింది. అమన్ దీప్ కూడా జాండీస్‌తో కన్నుమూసింది. ఆమె మరణించిన కొన్ని గంటల్లోపే డాలీ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది... అంటూ నటి కుటుంబీకులు ధృవీకరించారు. డాలీకి 2023లో గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డాలీకి ఒక కూతురు ఉంది.