బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (17:07 IST)

సహకరించినందుకు థ్యాంక్స్ : జూ.ఎన్టీఆర్

నందమూరి హరికృష్ణ తన మనవడు పంచెకట్టు కార్యక్రమాన్ని ఇటీవలే రాజమండ్రిలో నిర్వహించారు. ఇందుకు ఎన్టీఆర్‌, ఆయన కుటుంబం శనివారం వెళ్ళింది. ముందస్తు సమాచారం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు.

నందమూరి హరికృష్ణ తన మనవడు పంచెకట్టు కార్యక్రమాన్ని ఇటీవలే రాజమండ్రిలో నిర్వహించారు. ఇందుకు ఎన్టీఆర్‌, ఆయన కుటుంబం శనివారం వెళ్ళింది. ముందస్తు సమాచారం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందిలేకుండా జాగ్రత్తలను పోలీసు శాఖ తీసుకుంది. అలాగే, అభిమానులు రాజమండ్రి, కాకినాడకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. దీంతో చాలా సేపు ఎన్టీఆర్‌ పర్యటించిన ప్రాంతాల్లో భారీ కోలాహలం నెలకొంది. 
 
భద్రత కోసం కాకినాడ, రాజమండ్రిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ముగిసి తిరిగి వచ్చిన జూ.ఎన్టీఆర్‌.. అందరికీ థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు. 'అంతా సవ్యంగా జరిగేలా చూసిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి నా స్పెషల్‌ థ్యాంక్స్‌. మర్చిపోలేని స్వాగతం పలికి కాకినాడ, రాజమండ్రి అభిమానుల ప్రేమను కూడా నా థాంక్స్‌' అంటూ పోలీసులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.