గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 జులై 2016 (11:30 IST)

''కబాలి''కి కష్టాలు.. రిలీజ్‌కు లింగ డిస్ట్రిబ్యూటర్ మహాప్రభు అడ్డుపడ్డారు.. ఏం జరుగుతుందో?!

రజనీకాంత్ కబాలికి కష్టాలొచ్చిపడ్డాయి. లింగ సినిమాతో కబాలి రిలీజ్‌కు బ్రేకులు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కబాలి రిలీజ్‌ కోసం వేయికనులతో వేచిచూస్తున్న నేపథ్యంలో..

రజనీకాంత్ కబాలికి కష్టాలొచ్చిపడ్డాయి. లింగ సినిమాతో కబాలి రిలీజ్‌కు బ్రేకులు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కబాలి రిలీజ్‌ కోసం వేయికనులతో వేచిచూస్తున్న నేపథ్యంలో.. ''లింగ" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం ద్వారా.. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సుక్ర ఫిలిమ్స్ భాగస్వామి ఆర్. మహాప్రభు మద్రస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 
 
2014లో రిలీజైన లింగ సినిమాతో తాను భారీగా నష్టపోయానని... రజనీకాంత్ తనకు ఇంకా రూ. 89 లక్షలు చెంచాల్సి ఉందని.. తనకు రావాల్సిన మొత్తం చెల్లించాకే కబాలిని రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
మహాప్రభు పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎం. ఎం. సుంద్రేష్.. తమిళ సినిమా నిర్మాత మండలి, హీరో రజినీకాంత్‌తో పాటు దీనికి సంబంధించిన మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
రజినీకాంత్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడంతో కబాలి సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా గురువారం కోర్టు ఇచ్చే తీర్పును అనుసరించి కబాలి రిలీజ్ వుంటుందని సినీ పండితులు అంటున్నారు.