చెన్నై నగరంలో 'కబాలి' రికార్డు.. 10 రోజుల్లో రూ.10 కోట్లు వసూలు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'కబాలి'. ఈ చిత్రం గత నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ... కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, చెన్నై నగరంలో ఈ చి
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'కబాలి'. ఈ చిత్రం గత నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ... కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, చెన్నై నగరంలో ఈ చిత్రం కోలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చరిత్రను లిఖించింది. కేవలం 10 రోజుల్లో పది కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఈ చిత్రం విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే రూ.6 కోట్లు వసూలు చేసింది. రెండో వారాంతంలో 98 శాతం ఆక్యుపెన్సీతో 22 థియేటర్లలో 642 షోలు ప్రదర్శించారు. ఈ వారాంతం (జూలై 29 నుంచి 31వ తేదీ)లో ఏకంగా రూ.2 కోట్ల (రూ.2,19,22,890)ను వసూలు చేసింది.
అలాగే, ఈ చిత్రం విడుదలైన జూలై 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొత్తం పది కోట్ల రూపాయల (రూ.9,14,86,010)మేరకు కలెక్షన్లను రాబట్టింది. రజినీకాంత్ సినీ జీవిత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.